గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుని కలిశారు. దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజును కలిసిన గ్లోబల్ స్టార్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.