తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని , ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం’ . ఈ సినిమాతో జబర్తస్థ్ నటుడు ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ని విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ )ను హీరో నాని విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. తన కొడుకు జీవితంలో గొప్పగా ఎదగాలని ఒక తండ్రి ఆశిస్తుండగా.. నాన్న తనను అసలే అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్న కొడుకు సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.