టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు భారతీయ సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తారు. కుటుంబ విలువలకు అతడు ఇచ్చే ప్రాధాన్యత అంతే గొప్పది. ఇక భార్యతో అన్యోన్యత ఎప్పుడూ యంగ్ కపుల్స్ కి ఆదర్శం. అంతేకాదు.. అతడు ధరించే వస్త్రాలు, తినే ఆహారంలో కూడా భారతీయత కనిపించాల్సిందే. హిందూ సాంప్రదాయాలకు అంతే గౌరవం ఇవ్వడం అతడి ప్రత్యేకత. తినే ఆహారం మన తెలుగు వంటకం అయితే అతడు మరింతగా ఆస్వాధిస్తారు.ఓ ఇంటర్వ్యూలో సదరు కథానాయకుడి భార్య చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా భర్త భారతీయ ఆహారం తినాలి. ఏదైనా భోజనం భారతీయతతో ఉండాలి
అని ఆమె తెలిపారు.
తన భర్త ఎక్కడ ఉన్నా అక్కడికి కుక్కర్ లేదా వంట సామాగ్రి చేరుతుందని కూడా ధృవీకరించారు. ఆన్ ది లొకేషన్ స్పాట్ లో నే వేడి వేడి రుచికరమైన వంటకాలను తన భర్తకు తినిపిస్తారు. అలాగే ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టిన తన అత్తగారి విజయాన్ని ప్రమోట్ చేయడంలోను ఈ హైప్రొఫైల్ ఎంటర్ ప్రెన్యూర్ ముందుంటారు. అరవై వయసులోనుతన అత్తమ్మ రెడీ మిక్స్ ఆహారాన్ని ఎలా తాయరు చేసి అందిస్తారో కూడా చెబుతుంటారు. మేము ఎక్కడికి వెళ్లినా కుక్కర్‌ను తీసుకుని వెళతాము. దానిని ప్లగ్ ఇన్ చేసి వండుతాము. తద్వారా మేము ఎక్కడ ఉన్నా ఫైర్ అలారం మోగకుండా .. ఇంట్లో వండిన ఆహారం రెడీ అవుతుంది“ అని తెలిపారు. అత్తమ కిచెన్ పేరుతో తక్కువ సమయంలో ఆహారాన్ని రెడీ చేసి అందించే వ్యాపారాన్ని తన అత్తగారితో పాటు సక్సెస్ చేసిన ఘనత ఈ కోడలు సొంతం.