యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను పుష్ప 2తో సూపర్ హిట్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయా అని అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్‌కి సంబంధించి అప్‌డేట్ ని మేకర్స్ పంచుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ప్రారంభం అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్‌లో ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు తీసిన ఫొటోను చిత్రబృందం పంచుకుంది. ఈ ఫొటో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో దాదాపు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గోన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు.