HomeEntertainmentక్ష‌మించండి..కాంగ్రెస్ ఎమ్మెల్యే

క్ష‌మించండి..కాంగ్రెస్ ఎమ్మెల్యే

ప్రముఖ నటి రష్మిక మందన్నాపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అటు రాజకీయ పార్టీల నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం విమర్శలు గుప్పించారు. దాంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే దిగి వచ్చి.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. వాస్తవానికి గతవారంలో కర్నాటకలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ జరిగాయి. ఈ వేడుకలకు రష్మిక మందన్నా హాజరయ్యేందుకు అంగీకరించలేదంటూ రవి గనిగ మండిపడ్డారు. ఆమెకు గుణపాఠం చెప్పాలన్నారు. కెరియర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం నేర్చుకోవాలంటూ సూచించారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కావాలని గతేడాది ఎన్నోసార్లు రష్మికను కోరామని.. కర్ణాటకకు వచ్చేంత సమయం తనకు లేదని చెప్పిందని.. తమ ఇల్లు హైదరాబాద్‌లో ఉందని.. కర్నాటక ఎక్కడో తనకు తెలియనదన్నట్లుగా మాట్లాడిందన్నారు.

కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారని.. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా? అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు చిత్ర పరిశ్రమకు చెంన పలువురు మండిపడ్డారు. రష్మికకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రవి గనిగ వివరణ ఇచ్చారు. రష్మిక)కు గుణపాఠం నేర్పుతానని చెప్పానని.. జీవిత పాఠాలు చెప్పాలనుకున్నానని, కానీ దాడి చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు. ఎక్కిన నిచ్చెన లేకపోతే.. కిందపడిపోతావని చెప్పానన్నారు. రష్మికకు ఆహ్వానం పంపినా కర్నాటక రాష్ట్ర కార్యక్రమానికి హాజరుకాలేదన్నారు. ఈ రాష్ట్ర ఆహారాన్నే తింటూ పెరిగావని.. అందుకే ఈ రోజు అక్కడ ఉన్నావని.. నువ్వు నీకాళ్లపై నిలబడగలిగావన్నారు. తాను సైతం రష్మిక సినిమా చూశానని.. తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానన్నారు. మన రాష్ట్రం, మన భూమి, కన్నడ భాషను గౌరవించాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read