HomeEntertainmentఆర్‌సీ 16' షూటింగ్‌లో రామ్ చ‌ర‌ణ్‌

ఆర్‌సీ 16′ షూటింగ్‌లో రామ్ చ‌ర‌ణ్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్ లో ‘ఆర్‌సీ 16’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ప్రారంభమైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేప‌టి నుంచి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. రాత్రివేళ సాగే ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ప్రధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ సెట్‌ను నిర్మించిన‌ట్లు స‌మాచారం. ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో ఓ ఆట‌తో ముడిప‌డి ఉన్న భావోద్వేగ‌పూరిత‌ క‌థాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాక్‌. చెర్రీ స‌ర‌స‌న క‌థానాయిక‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ బాణీలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img