HomeEntertainmentSDT18..మార‌ణ‌హోమమే

SDT18..మార‌ణ‌హోమమే

సుప్రీమ్‌ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న‌ కొత్త ప్రాజెక్ట్‌ను మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ సినిమా నుంచి డిసెంబ‌ర్ 12న క్రేజీ అప్‌డేట్‌ను పంచుకోనున్న‌ట్లు తెలిపారు. SDT18..మార‌ణ‌హోమమేఇక ఈ సినిమాకు సంబ‌రాల ఏటి గట్టు అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. 1947 హిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండ‌గా.. ఇలాంటి టైటిల్ అయితేనే మూవీకి స‌రిపోతుంది అని చిత్ర‌బృందం అనుకున్న‌ట్లు టాక్. ఈ మూవీలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా ఎస్‌డీటీ 18 రూపొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img