HomePoliticalFlash : చేయి జారిన సిట్టింగ్ సీటు !

Flash : చేయి జారిన సిట్టింగ్ సీటు !

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. తాజాగా జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. అందులో సిట్టింగ్ స్థానం కోల్పోవడం రేవంత్ సీటుకు ఎసరు తెచ్చేలా ఉంది. దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తోన్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదు. తాజాగా జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కంటే ఒక్క సీటు కూడా అధికార పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నా.. ఆ పార్టీ ఓటర్లు.. కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదనే విషయం స్పష్టమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకం తీసుకున్న ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీని ఛీ కొట్టారనే చెప్పాలి.

ఉమ్మడి కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్ధి విజయ బావుటా ఎగరేసారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో విమర్శలు ఎదుర్కుంటోంది.ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్‌కు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎదురుదెబ్బ తగిలింది. సిటింగ్‌ స్థానం కావడం… రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని అధిష్ఠానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినా చివరికి ఓటమి తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పినా ఫలితం లేక పోయింది.దీంతో సీఎం రేవంత్ కు కష్టకాలం మొదలైందనే చెప్పాలి. దీంతో ఆయన పై అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే పక్క పార్టీ నుంచి వచ్చిన ప్యారష్యూట్ నేత అయిన రేవంత్ కు సీఎం కట్టబెట్టడంపై పార్టీని ఎంతో కాలంగా నమ్ముకున్న నేతలకు మింగుడు పడటం లేదు. అయితే అధిష్ఠానం వద్ద రేవంత్ రెడ్డి పలుకుబడి ఉండటం వలన ఏమి అనలేకపోయారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ మొదలైందనే కామెంట్స్ రాజకీయంగా వినబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read