సోమవారం 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్కు బిఆర్ఎస్ రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికాగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా…. తెలంగాణ రాష్ట్రాన్ని10 ఏళ్లు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,హార్దిక శుభా కాంక్షలు తెలియజేశారు.
మరోవైపు, విదేశాలలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడు కలు ఘనంగా నిర్వహిస్తు న్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూకేలోనూ ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్‌లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అలాగే, యుఎస్ఏలోని బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యం లో పలు రక్తదాన శిబిరాలు నిర్వహించి, కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ వేడుకలు కేసీఆర్ ప్రజా సేవలు, ఆలోచనలను గమనించి, ఆయనకు ప్రేమను, గౌరవాన్ని తెలుపు తున్న అభిమానులు కార్యకర్తలు వేడుకలు జరుపుతున్నారు.