విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి జనవరి 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరాను. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ప్రధాని ఏపీకి వస్తున్నారు, ఇదొక చారిత్రాత్మక పర్యటన కాబోతుంది. ప్రధాని పర్యటనను విజయవంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను సమీక్షించాను, పలు సూచనలు చేశాను. అనంతరం సభాస్థలిని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.