కాంతార సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీనితో పాటు తెలుగులో ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నారు. ఇదిలావుండగా.. ఆయన బాలీవుడ్ నుంచి వస్తున్న ఒక సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమాకు ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే టైటిల్‌ను పెట్టారు మేకర్స్. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాను 2027 జనవరి 21న హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.