యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చిత్రంలోని సాంగ్స్, టీజర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. పలు కారణాల వల్ల 2024 డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో, సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.తాజాగా, మేకర్స్ ఒక పర్‌ఫెక్ట్ డేట్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. వేసవి ప్రారంభానికి ముందే విడుదలవుతున్న ఈ చిత్రం, ఉగాది సెలవులను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.