రోషన్ కనకాల కొత్త చిత్రంతో రానున్నాడు.. రోషన్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కలర్ ఫొటో వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రాజ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు రోషన్.
ఈ సినిమాకు మౌగ్లీ అనే సూపర్ హీరో టైటిల్ పెట్టారు మేకర్స్. అప్పుడెప్పుడో వినాయక చవితి కానుకగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ముహుర్తపు షాట్‌ను యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొట్టగా.. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సమ్మర్ 2025 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.