HomeEntertainmentఓటీటీలో 'ఆర్ ఆర్ ఆర్' డాక్యుమెంట‌రీ..

ఓటీటీలో ‘ఆర్ ఆర్ ఆర్’ డాక్యుమెంట‌రీ..

దర్శకధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్ . అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా క‌థానాయిక‌లుగా న‌టించారు. డీవీవీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువ‌చ్చిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్ అంటూ వ‌చ్చిన ఈ డాక్యు ఇటీవ‌లే ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో విడుద‌లై మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ కొత్త‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీ ర‌న్ టైం 1 గంట 38 నిమిషాలు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read