ఏపీలో విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు, ఆకస్మికంగా,అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్కు టుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమిప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ. లక్ష రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత ఎక్స్ వేదిక గా వెల్లడించారు.