రూ. 25 లక్షలు లంచం తీసుకున్న విశాఖ డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అరెస్టు ను సీబీఐ అధికారులు ధ్రువీకరించారు..ఆయనతోపాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్లు సునీల్ రాథోడ్ , ఆనంద్ భగత్ లను అరెస్టు చేశారు. డీఆర్ఎం విశాఖలో ఉన్న ఇంటిని, కార్యాలయం, ముంబై, వడోదరో.. ఇలా మొత్తం 11చోట్ల సీబీఐ సోదాలు చేసింది. సౌరబ్ ఇంటిలో ఇండియన్, ఫారిన్ కరెన్సీ 87.60 లక్షల నగదు, 72 లక్షల విలువ చేసి బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ముంబైకు చెందిన డిఎన్ కంపెనీ, పూణేకు చెందిన హెచ్‌ఆర్‌కే సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలకు రైల్వే కాంట్రాక్టర్లకు పనులు మంజూరు చేశారు.
పనుల్లో జాప్యతకు జరిమానా, 3.17 కోట్లు విలువ చేసే బిల్లుల క్లియరెన్స్‌కు లంచం డిమాండ్ చేశారు. పనులు జాప్యం కారణంగా రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు భారీగా జరిమానా విధించింది. కాంట్రాక్టర్లకు విధించిన భారీ జరీమాన తగ్గించేందుకు రూ. 3.17 కోట్ల బిల్లులకు క్లియరెన్స్ ఇవ్వడానికి డిఆర్ఎంతో కాంట్రాక్టర్లు డీల్ కుదుర్చుకున్నారు. జరిమానా తగ్గించేందుకు, బిల్లులు క్లియర్ చేసేందుకు డీఆర్ఎం చెరో కంపెనీ తనకు రూ. 25 లక్షలు లంచంగా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ ముంబైలో డీఆర్ఎంకు రూ. 25 లక్షలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..