▪️ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో చెలరేగిన మంటలు
▪️బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
▪️వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది.
▪️ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు
▪️రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.
▪️తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.