తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని హీరో నటుడు సాయి దుర్గ తేజ్ దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమల చేరుకున్న సాయి దుర్గ తేజ్.. బుధవారం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు.