HomeEntertainmentవరుణ్‌ ధావన్ తో.. స‌మంత స్టెప్పులు

వరుణ్‌ ధావన్ తో.. స‌మంత స్టెప్పులు

స్టార్‌ నటి సమంత తాజాగా హిందీ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో సామ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వరుణ్‌ ధావన్ క‌థానాయకుడిగా న‌టించారు. ఈ నెల 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా చిత్రబృందం సిటాడెల్‌ సక్సెస్‌ పార్టీని గత రాత్రి ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీలో సామ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బేబీ జాన్’ నుంచి ఇటీవల విడుదలై దుమ్ము రేపుతున్న ‘నైన్ మటక్కా’ సాంగ్‌కు సమంత, వరుణ్ ధావన్ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారి స్టెప్పులకు ఫిదా అయిన సినీ ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు సమంత, వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ నుంచి ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఇచ్చిన పార్టీలో సమంత, వరుణ్ ఇలా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ పార్టీ ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ‘అందమైన వ్యక్తులతో గడిపిన అందమైన సాయంత్రం.. నా మనసంతా ఆనందం, కృతజ్ఞతతో నిండిపోయింది’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ తగిలించింది. సమంత పోస్టుకు వరుణ్ ధావన్.. ‘ఎప్పటికీ ది బెస్ట్ కో స్టార్’ అంటూ రిప్లై ఇచ్చాడు. 

https://twitter.com/ApnaaVarun/status/1862225703275831641

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img