టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ కు సంబంధించిన పిక్ షేర్ చేసుకోవడం మరో కారణం. వంగా కార్యాలయం ఫోటోలో అనేక ఇంగ్లీష్ చిత్రాల పోస్టర్స్ ఉన్నప్పటికీ.. మెగాస్టార్ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.చిరంజీవి నటించిన ఆరాధన మూవీలోని పోస్టర్ అది. అందులో ఆయన కోపంతో వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సుహాసిని హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తమిళ సూపర్ హిట్ కడలోర కవితైగల్ రీమేక్ గా రూపొందిన ఆ మూవీ.. 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్యారెక్టరైజేషన్, మెగాస్టార్ నటన సందీప్ వంగాను మంత్రముగ్ధులను చేసినట్లు అర్థమవుతోంది. ఏదేమైనా చిరు నుంచి ప్రేరణ పొందిన వారిలో ఆయన కూడా ఒకరు. అయితే సందీప్ తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు కూడా సౌమ్యంగా అస్సలు ఉండరు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ ద్వారా మనమంతా చూశాం. ఆరాధనలో పులిరాజుకు మించిన కోపంతో ఉంటాయి సందీప్ వంగా హీరోల రోల్స్.