ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింది కిట్లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు జారీ కాగా.. రాష్ట వ్యాప్తంగా కిట్ల పంపిణీకి రూ.953.71 కోట్ల ఖర్చు చేయనున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.778.68 కోట్లు మంజూరు చేయనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థుకు ఇచ్చే కిట్‌లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు ఇవ్వనున్నారు.
, సగటున ఒక్కో విద్యార్థికి కిట్టు ఇచ్చేందుకు రూ.1,858 ఖర్చు అవుతోందని అధికారులు వెల్లడించారు. యూనిఫాంకు సంబంధించి కుట్టు కూలి కింద 1 నుంచి 8 తరగతి వరకు రూ.120, 9వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.240 ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.