HomeEntertainmentభ‌యంకరంగా ..ర‌ణ్ దీప్ హుడా పోస్ట‌ర్..గ్లింప్స్

భ‌యంకరంగా ..ర‌ణ్ దీప్ హుడా పోస్ట‌ర్..గ్లింప్స్

బాలీవుడ్ స్టార్ యాక్టర్‌ సన్నీడియోల్ నటిస్తోన్న చిత్రం జాట్ . టాలీవుడ్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తన్ను ఈ చిత్రంతో సన్నీడియోల్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు‌. తాజాగా రణ్‌దీప్ హుడా రోల్‌ను పరిచయం గ్లింప్స్ షేర్ చేశారు. ఇందులో రణతుంగ పాత్రలో నటిస్తున్నాడు రణ్‌దీప్‌ హుడా. నాకు నా పేరంటే చాలా ఇష్టం.. అంటూ రణ్‌దీప్‌ హుడా తనను తాను ఎలివేట్‌ చేసుకుంటూ సాగే సంభాషణలతో కట్‌ చేసిన గ్లింప్స్ స్టన్నింగ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్‌ థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్‌ కాగా.. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఎస్‌డీజీఎం ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read