HomePoliticalతెలుగు రాష్ట్రాల్లో.. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో.. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదే స్థానంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. వీటితో పాటు వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ఉపాధ్యాయ నియోజ‌కవ‌ర్గానికి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అటు ఏపీలో ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌కవ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img