శనివారం హైదరాబాద్ లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹10,304 గా ఉంది, అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ₹9,445 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర ₹7,728 గా ఉంది. భారతదేశంలో ఇన్వెస్టర్లకు బంగారం, వెండి ఎప్పుడూ సురక్షితంగా కనిపిస్తూ ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, ఆచారాలు ఇలా ఈ సీజన్ వచ్చినా పసిడిని కొనేస్తూ ఉంటారు. అయితే వాటి ధరలు పెరగడం లేదా పడిపోవడంలో కేవలం ఆభరణాల డిమాండ్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక అసలు రహస్యపు శక్తులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని సెబీ-నమోదు పొందిన రీసెర్చ్ అనలిస్ట్ సుమేష్ గులేరియా చెబుతున్నారు. . సాధారణంగా దీపావళి, దసరా, ధన్‌తేరస్ సీజన్ వచ్చిందంటే బంగారం, వెండి మార్కెట్లు ఎప్పటిలాగే కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఆనందం వెనుక పెట్టుబడి వాస్తవాలను గమనించకపోతే సామాన్యులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని అధిక ధరలకు కొనుగోలు చేసి, తర్వాత నష్టపోయే అవకాశం ఉందని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సుమేష్ గులేరియా హెచ్చరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి అంతర్జాతీయ ధరలు నిరంతర పెరుగుదలతో రికార్డులను తాకుతున్నాయి. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల మార్పు అంచనాలు ఇవన్నీ కలిసి Gold ర్యాలీకి ఇంధనమిచ్చాయి. ఫలితంగా.. భారతీయ మార్కెట్లో బంగారం 24 క్యారెట్ల ధర లక్ష రూపాయల దాటగా, వెండి కిలో ధర కూడా లక్ష రూపాయలను దాటింది.