అమరావతి: దేవాదాయ శాఖ కార్యదర్శిగా వి. వినయ్ చంద్, IAS నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. వినయ్ చంద్ IAS అనుభవం మరియు పరిపాలనా నైపుణ్యం దేవాదాయ శాఖ అభివృద్ధి విషయం లో , దేవాలయాల ఆధునీకరణలో, మరియు భక్తులకు మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన, మరియు ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులపై కార్యదర్శి తో చర్చించారు. పరస్పర సహకారంతో శాఖ కార్యక్రమాలు మరింత విజయవంతంగా అమలవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.వినయ్ చంద్ IAS దేవాదాయ శాఖ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని శాఖ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.వినయ్ చంద్ తో పాటు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడ భేటీ అయ్యారు.