కల్కి 2898 ఏడీ చిత్రం తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ‘రాజా సాబ్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీన సినిమా విడుదల కావడంలేదని ఈ ప్రాజెక్టుతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు వెల్లడించారు. ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని, ఆ రోజున సినిమా రావడంలేదని తెలిపారు. కొత్త తేదీ ఖరారు చేశార ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని పేర్కొన్నారు. ఇక, అభిమానుల కోసం సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ టీమ్ నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ కానుందని వివరించారు. ‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ నటి మాళవికా మోహనన్ కు ఇది తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. ‘రాజా సాబ్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.