ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలైన నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న సహా పలువురు ఉన్నట్టు తెలిసింది. చల్పాక అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు బృందం సంయుక్తంగా కూంబింగ్ నిర్వహస్తుండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.