HomePoliticalటిడీపీలో చేరిన‌..పులివెందుల‌..వైసీపీ కౌన్సిల‌ర్

టిడీపీలో చేరిన‌..పులివెందుల‌..వైసీపీ కౌన్సిల‌ర్

ఇప్పటికే ఏపీలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది. జగన్ అడ్డాలో ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ కేడర్ సిద్ధమయింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ కు తెలియజేస్తోంది.పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. త్వరలోనే మరింత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read