అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్ లో గిల్ ఈ అరుదైన మైలురాయిని సాధించడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన ఆ తర్వాత పుంజుకుంది. ఇటీవల ఫామ్‌లేక తంటాలు పడుతున్న కోహ్లీ అర్ధ శతకం (52) చేశాడు. అలాగే గిల్ ఈ సిరీస్ లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గిల్, కోహ్లీ ద్వయం రెండో వికెట్ కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో భారత్ 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. గిల్ 78, అయ్యర్ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు.