HomeSportsశుభ్ మ‌న్ గిల్.. క్లీన్ బౌల్డ్

శుభ్ మ‌న్ గిల్.. క్లీన్ బౌల్డ్

చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. వంద పరుగుల వద్ద ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అవుట్‌ అయ్యాడు. 17.3 ఓవర్‌లో అబ్రార్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 46 పరుగులు చేసిన గిల్‌.. త్రుటిలో హాఫ్‌ సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. 52 బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో గిల్‌ 46 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం శ్రేయాస్‌ అయ్యర్‌, సీనియర్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు 31 పరుగుల వద్ద తొలి షాక్‌ తగిలింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 20 పరుగులకే అవుట్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మను పాకిస్తాన్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఫుల్‌ లెన్త్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఐదో ఓవర్‌లో చివరి బంతికి రోహిత్‌ అవుట్‌ అయ్యాడు. టీమిండియా వికెట్‌ నష్టానికి 31 పరుగులు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img