HomeEntertainmentఅద‌ర‌గొడుతోన్న‌..సికింద‌ర్ టీజ‌ర్

అద‌ర‌గొడుతోన్న‌..సికింద‌ర్ టీజ‌ర్

కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్ . జై హో సినిమా త‌ర్వాత ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను రంజాన్‌ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి గ్లింప్స్‌ను వ‌దిలిన చిత్రబృందం తాజాగా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నాన్న‌మ్మ అత‌డికి సికంద‌ర్ అని పేరు పెట్టింది. తాత ఏమో సంజ‌య్ అని పెట్టాడు. కానీ ప్ర‌జ‌లు మాత్రం అత‌డిని రాజాసాబ్ అని పిలుస్తారు అంటూ టీజ‌ర్ మొద‌లైంది. ఈ టీజ‌ర్ చూస్తుంటే.. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగిన ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి. ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రంలో సత్యరాజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read