భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి ని సింధు మనువాడనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి స్టార్ షట్లర్ తొలిసారి స్పందించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింధును విలేకరులు పెళ్లి గురించి ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘అవును, ఈనెల 22న నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ సమాధానమిచ్చారు.