దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న రాత్రి జరిగిన కోల్డ్ ప్లే బ్యాండ్ కన్సర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ ‘జై శ్రీరామ్’ అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్‌ను తన పాటలతో అలరించిన అనంతరం ఆయన షుక్రియా, జై శ్రీరామ్ అని అన్నారు. ఓ అభిమాని ప్లకార్డుపై ‘జై శ్రీరామ్’ అని రాయడంతో దానిని క్రిస్ మార్టిన్ చదివారు. అలాగే ఈ ఈవెంట్‌లో ఆయన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ప్రస్తావించారు. ‘కన్సర్ట్ తర్వాత బుమ్రాతో క్రికెట్ ఆడబోతున్నా’ అని అన్నారు.