HomeEntertainmentచిరంజీవిని కొత్త అవ‌తారంలో చూపిస్తా..'శ్రీకాంత్ ఓదెల‌'

చిరంజీవిని కొత్త అవ‌తారంలో చూపిస్తా..’శ్రీకాంత్ ఓదెల‌’

మెగాస్టార్ చిరంజీవితో తీయ‌బోయే సినిమా త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని పేర్కొన్నారు శ్రీకాంత్ ఓదెల. ఇక చిరుకు ఈ యువ డైరెక్ట‌ర్ వీరాభిమాని అనే విష‌యం తెలిసిందే. చిరంజీవితో చిత్రంపై శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ… “చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయ‌న‌తో ప‌నిచేస్తున్నానంటే న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఈ చిత్రం నాకెంతో ప్ర‌త్యేకం. చిరంజీవి మునుప‌టి సినిమాల‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. అంతేగాక ఆయ‌నను ఇందులో కొత్త అవ‌తార్‌లో చూస్తారు. మూవీలో ఆయ‌న పాత్ర ఎంతో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది.

సుమారు 48 గంట‌ల్లోనే తాము ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేసేశాం. చిరు ఉత్సుక‌త నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఇక ఆయ‌న కారవాన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కే నేను ఆయ‌న అభిమానిని. ఒక్క‌సారి సెట్‌లోకి అడుగుపెట్టారంటే నా మూవీలో ఆయ‌న ఒక పాత్ర మాత్ర‌మే” అని శ్రీకాంత్ ఓదెల అన్నారు. నానితో తాను తెర‌కెక్కించిన మొద‌టి సినిమా ‘ద‌స‌రా’ క‌థ‌కు త‌న తండ్రే స్ఫూర్తి అని అన్నారు. చిన్న‌త‌నంలో త‌న తండ్రి బొగ్గుగ‌నుల్లో ప‌ని చేయ‌డానికే వెళ్లేవార‌ని, ఆ స్ఫూర్తితోనే ఈ మూవీ స్టోరీ రాసిన‌ట్లు తెలిపారు. కాగా, 2019లో విడుద‌లైన ‘బ్రోచేవారెవ‌రురా’ చిత్రం చూసిన త‌ర్వాత త‌న మ‌న‌సు మార్చుకున్నాన‌ని, సినిమాల్లోకి అడుగుపెట్టాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. వెంట‌నే త‌న స‌ర్టిఫికేట్స్ అన్నీ త‌గ‌ల‌పెట్టేశాన‌ని ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img