HomeDevotionalబ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్ధ‌మైన శ్రీశైల మ‌హాక్షేత్రం

బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్ధ‌మైన శ్రీశైల మ‌హాక్షేత్రం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 19న ప్రారంభం అవుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాలను, మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని అర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతి శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు చంద్రావతి కల్యాణ మండపం వద్ద నుంచి ఈ నెల 23 వరకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img