HomeEntertainmentఎన్టీఆర్ న్యూలుక్..అదుర్స్

ఎన్టీఆర్ న్యూలుక్..అదుర్స్

ఇటీవ‌ల దేవ‌ర సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు అగ్ర క‌థానాయ‌కుడు జూనియర్‌ ఎన్టీఆర్ . అయితే తార‌క్ త‌న సినిమా సినిమాకి లుక్‌ని మారుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా సినిమా సినిమాకి మేకోవర్‌ మార్చుకుంటూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇప్ప‌టికే వార్ 2 కోసం ప్ర‌త్యేక లుక్‌లో ఉన్న తార‌క్ ప్ర‌శాంత్ నీల్‌తో రాబోతున్న డ్రాగ‌న్ ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే తార‌క్ తాజాగా ఎవరూ ఊహించని లుక్‌తో క‌నిపించాడు. స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్ తో బ్లాక్‌ జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి వెళుతుండ‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు తారక్‌. కాగా ఇందుకు సంబంధించిన లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గోంటున్నాడు. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోష‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read