HomeEntertainmentఒకేసారి మూడు సినిమాలు..బిజీగా ప్ర‌భాస్

ఒకేసారి మూడు సినిమాలు..బిజీగా ప్ర‌భాస్

స్టార్ హీరో ప్రభాస్‌ త్వరలో మళ్లీ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ది రాజాసాబ్‌ సెట్‌లో జాయిన్ అవుతారు. పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ అంతా పూర్తవుతుంది.సాంగ్స్‌ షూట్‌ కోసం తరువాత మళ్లీ డేట్స్ అడ్జస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్‌. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హను రాఘవపూడి మూవీ షూటింగ్ కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.మరో వైపు సలార్ 2 వర్క్‌ కూడా జెట్‌ స్పీడుతో జరుగుతోంది. ఇంత బిజీలోనూ మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు డార్లింగ్‌. బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీకి సీక్వెల్‌గా ఎనౌన్స్ అయిన కల్కి 2ని జూన్‌ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.ఒకే సారి మూడు సినిమాలు లైన్‌లో ఉండటంతో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లోనే పట్టాలెక్కుతుందనుకున్న స్పిరిట్ వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న సందీప్‌ రెడ్డి వంగా, డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.ప్రభాస్‌ ఫ్రీ అవ్వటమే ఆలస్యం, ఎనీ టైమ్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారు సందీప్‌. కానీ ఇప్పట్లో సందీప్‌ నెంబర్‌ వచ్చేలా కనిపించటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img