HomeSportsశుభమన్‌గిల్ ఓకే .. మరి కేఎల్ రాహుల్

శుభమన్‌గిల్ ఓకే .. మరి కేఎల్ రాహుల్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ శుభమన్ గిల్ మళ్లీ జట్టులోకి వచ్చేశాడు. పూణెలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహించనున్నట్టు ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చటే తెలిపాడు. రిషభ్‌పంత్ కూడా ఫిట్‌గానే ఉన్నాడని రేపటి టెస్టులో ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకుంటే కనుక ధ్రువ్ జురెల్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

జట్టులో గిల్ స్థానం పక్కా కావడంతో ఇప్పుడు చర్చంతా కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ఖాన్‌పైకి మళ్లింది. గిల్ రాకతో వీరిద్దరిలో ఎవరి స్థానానికి ఎసరు పడుతుందన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. ఈ స్థానానికి ఇప్పుడు పోటీ ఉందని ర్యాన్ పేర్కొన్నారు. అయితే, ర్యాన్ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపాడు. తొలి మ్యాచ్‌లో రాహుల్ పరుగులు చేయనప్పటికీ ఒక్క బంతిని కూడా మిస్ చేయలేదని తెలిపాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుందని పేర్కొన్నాడు. కాబట్టి రాహుల్ విషయంలో ఆందోళన అవసరం లేదన్నాడు. ఈ ఏడాది మొదట్లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రాహుల్ శతకం నమోదు చేశాడు. గాయంతో బాధపడుతూ జట్టు నుంచి తప్పుకోవడానికి ముందు ఇంగ్లండ్‌పై అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ఖాన్ అద్భుత బ్యాటింగ్‌తో 150 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్, సర్ఫరాజ్‌లలో ఎవరిని తుదిజట్టులోకి తీసుకోవాలన్న విషయంలో టీం మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. అయితే, సర్ఫరాజ్‌తో పోలిస్తే రాహుల్‌కే అవకాశాలు ఎక్కువున్నట్టు ర్యాన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img