HomeEntertainmentసినిమాలు తీయ‌డం మానేస్తా..సుకుమార్

సినిమాలు తీయ‌డం మానేస్తా..సుకుమార్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తాను సినిమాలు చేయ‌డం మానేస్తానంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఆదివారం నాడు ‘గేమ్ చేంజ‌ర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డ‌ల్లాస్ లో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో యాంక‌ర్ సుమ… లెక్క‌ల మాస్టారు సుక్కును ‘దోప్’ అనే ప‌దంతో ఒక‌టి వ‌దిలేయాలంటే మీరు ఏం వ‌దిలేస్తారు? అని ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న “సినిమాలు చేయ‌డం మానేస్తాను” అని స‌మాధానం ఇచ్చారు. దాంతో సుకుమార్‌ ప‌క్క‌నే కూర్చున్న హీరో రామ్‌చ‌ర‌ణ్ ఆయ‌న వ‌ద్ద నుంచి మైక్ తీసుకుని… “లేదండి.. ఈయ‌న గ‌త కొన్నేళ్లుగా ఇలాగే అంద‌రినీ భ‌య‌పెడుతున్నారు. అది జ‌రిగేది కాదు” అంటూ క‌వ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img