HomeEntertainmentరావుల‌మ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్

రావుల‌మ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్

టాలీవుడ్‌ యాక్టర్‌ సందీప్‌ కిషన్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మ‌జాకా . త్రినాథరావు న‌క్కిన‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రావు రమేశ్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీం. కాగా సందీప్ కిషన్‌ టీం తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఈ మూవీ నుంచి రావులమ్మ సాంగ్ లైవ్‌ ఫిల్మ్‌ షూట్‌ ఎలా ఉండబోతుందో తెలియజేసింది. సాంగ్‌ షూట్‌కు సంబంధించిన ఫుల్ వీడియోను షేర్ చేసింది. ఇండస్ట్రీలో తొలిసారి ఇలాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన బ్యాచిలర్స్‌ ఆంథెమ్‌ సాంగ్‌తోపాటు మెలోడీ ట్రాక్‌ Love యే లైఫ్ అందామా? పాటలకు మంచి స్పందన వస్తోంది. మజాకా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌లో సందీప్ కిష‌న్ పంచె క‌ట్టులో క‌నిపిస్తూ సందడి చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img