దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారం చివరి పనిదినం సందర్భంగా సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది. పదవీకాలం నవంబర్ 10న ముగియనున్న డివై చంద్రచూడ్ 8 నవంబర్ 2022న బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పదవిలో ఉన్నారు.చంద్రచూడ్ నేతృత్వంలోనే ధర్మాసనం… హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిరానికి సంబంధించి విశిష్ట తీర్పును ఇచ్చింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం మైనారిటీ హోదాకు సంబంధించి తీర్పునిచ్చింది. విశ్వవిద్యాలయం మైనారిటీ హోదాను కొనసాగించింది.తదుపరి సీజేఐగా ఖన్నా బాధ్యతలు చేపట్టినున్నారు