HomeSports36బంతుల్లో..67ప‌రుగులు..సూర్య‌వంశీ

36బంతుల్లో..67ప‌రుగులు..సూర్య‌వంశీ

యువ భారత జట్టు అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. షార్జాలో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ అండర్-19 టీమ్ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల విజృంభణతో లంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం, 174 పరుగుల టార్గెట్ ను టీమిండియా అండర్-19 కుర్రాళ్లు కేవలం 21.4 ఓవర్లలోనే 3 వికెట్లకు ఛేదించారు. 13 ఏళ్ల సంచలన టీనేజి ఓపెనర్ వైభవ్ సూర్యవంశి శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. సూర్యవంశి 36 బంతుల్లోనే 67 పరుగులు చేయడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్. ఈ బీహార్ కుర్రాడి స్కోరులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. అంతేకాదు, ఓ ఓవర్లో 31 పరుగులు బాదాడంటే… అతడి దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే 7 ఫోర్లతో 34 పరుగులు చేయగా…. ఆండ్రీ సిద్ధార్థ్ 22, కెప్టెన్ మహ్మద్ అమాన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ విహాస్ తెమ్విక 1, విరాన్ చముదిత 1, ప్రవీణ్ మనీశ 1 వికెట్ తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img