మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైయినట్లు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు.. వైద్యులు ప్రస్తుతం అంజనమ్మకి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిరంజీవి టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంజనాదేవి అస్వస్థతకు గురైయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే గత వారం అంజనమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చిరంజీవి టీమ్ వెల్లడించింది.