ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు తారకరత్న అస్వస్థతకి గురై ..ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త టిడిపి శ్రేణులతో పాటు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా తారకరత్న లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి.. వీరి కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.కాగా అలేఖ్య సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమాల్ని పలక రిస్తుంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఎక్కువగా పిల్లలకు సంబం ధించిన విషయాలు షేర్ చేస్తుంటారు. తాజాగా అలేఖ్య కుమార్తెకు సంబంధించి ఇన్ స్టా వేదికగా మరో శుభవార్త పంచుకున్నారు. తన పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ వేడుక జరిగిందంటూ దానికి సంబంధించిన వీడి యోలు, ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేసారు.
ప్రాంగణం వద్ద తండ్రి తారకత్న ఫోటోలను అందంగా డెకరేట్ చేసి నివాళులు అర్పించి కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నిష్క హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా ఉంది. వేడుక కోసం ఎంతో అందంగా ముస్తాబైంది. నుదిటిన పాపిడి బొట్టు..మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం, చెవులకు పెద్ద బుట్టలు, రెండు చేతులకు గాజులు ధరించింది. క్రీమ్ కలర్ చీర మ్యాచింగ్ రవికలో నిష్క ఎంతో అందంగా కనిపిస్తుంది. నిష్క అచ్చంగా డాడ్ తారకరత్న పోలికలతోనే ఉంది. ఈ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి తరుపు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అంతా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత విజయసాయి రెడ్డి సతీసమేతంగా పాల్గొని నిష్కని ఆశీర్వదించారు.