HomePoliticalటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖ‌రారు..మార్చి 20న పోలింగ్

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖ‌రారు..మార్చి 20న పోలింగ్

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 ఎమ్మెల్సీ స్థానం కేటాయించిన టీడీపీ… మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించింది. బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ కాగా, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.

శ్రీకాకుళంకు చెందిన కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె. ఇక, నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర మొదటి నుంచి పార్టీకి నమ్మకంగా సేవలందిస్తున్నారు. బీటీ నాయుడు కర్నూలు జిల్లా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే నామినేషన్ కూడా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read