ఐదు లక్షల ప్రమాద భీమా తీసుకోవడానికి ఎల్‌ఐసీకో.. మరో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకో ఏడాదికి కనీసం నాలుగైదు వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రూ. వంద పెట్టి టీడీపీ మెంబర్ షిప్ తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమానే కాదు ఇతర సపోర్టు కూడా ఉంటుంది. టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేందుకు చేపట్టిన వినూత్న సపోర్టుతో సభ్యత్వాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. టీడీపీ సభ్యత్వాలు ఓపెన్ చేసిన మూడు రోజుల్లోనే ఐదు లక్షల మందికిపైగా కొత్తగా సభ్యత్వం తీసుకోవడమో.. పునరుద్ధరణ చేసుకోవడమో చేశారు.
టీడీపీ సభ్యత్వం ఆషామాషీగా ఉండదు. మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడమో.. ఎవరో ఒకరి పేరు రాసుకోవడమో ఉండదు. వివరాలు పక్కాగా ఉండాలి ఓటర్ కార్డు నెంబర్ కూడా ఉండాలి. అలా ఉంటేనే సభ్యత్వం వస్తుంది. అంటే అయ్యే ప్రతి మెంబర్ షిప్ జీనియన్ అనుకోవచ్చు. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ చేపట్టే కార్యక్రమాలు వినూత్నంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది … యాక్టివ్ గా లేకపోయినా అభిమానం కోసం మెంబర్ షిప్ తీసుకోవడాన్ని ఓ పాలసీగా పెట్టుకుంటారు. టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు రూ.10 వేలు అందించనున్నారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుంది.
ప్రతి రెండేళ్లకు ఓ సారి టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గెలిచినప్పుడు అందరూ యాక్టివ్ సభ్యత్వాలను తీసుకోవడం ఏ పార్టీలోనైనా ఉంటుంది. కానీ టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఇలాంటి సభ్యత్వాలు పెరుగుతూ ఉంటాయి. అదే టీడీపీకి ఉన్న బలం అనుకోవచ్చు.