చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించడంతో మినీ ప్రపంచకప్‌లో టీమిండియా గెలుపొందింది. 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఇద్దరు 69 పరుగులు జోడించారు. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన రోహిత్.. వరుస ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించిన రోహిత్ శర్మ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. 36 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయం 41 పరుగులు చేసిన రోహిత్.. తక్సిన్ బౌలింగ్‌లో రషిద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ.. 38 బంతుల్లో 22 పరుగులు చేసిన విరాట్ రషిద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ తక్కువ స్కోర్‌కే అవుట్ అయినా.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ టీమిండియాను విజయం వైపు నడిపించారు. గిల్ 128 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 47 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో రషిద్‌కు రెండు, తక్సిన్ అహ్మద్, రెహమాన్‌కు చెరో వికెట్ దక్కింది.