హీరో అల్లు అర్జున్ పై నాకెందుకు కోసం ఉంటుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ… అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని… ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ, ఫార్మా మాదిరే సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని తెలపారు.