ఘన విజయంతో ప్రియాంకగాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.వయనాడ్ లో భారీ ఆధిక్యతలో ప్రియాంకగాంధీ విజయాన్ని సాధించారు.ఆమెకు వయనాడ్ ప్రజలు రికార్డు విజయాన్ని అందించారని రేవంత్ రెడ్డి అన్నారు.గత ఎన్నికల్లో రాహుల్ కు 3.64 లక్షల ఓట్ల మెజార్టీ…వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భారీ ఆధిక్యతతో దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ… వయనాడ్ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఘన విజయంతో ప్రియాంకాగాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని చెప్పారు. వయనాడ్ లో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని ప్రియాంక బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.