తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆదివారం ఆయన వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద కాన్వాయ్ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. ప్రాణపాయం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.